
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 26
తర్లుపాడు మండలం తుమ్మల చెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ పథకాలను రైతులకు తెలియజేశారు. పీఎంఫబయ్ పంటల బీమా పథకం ఆగస్టు 30వ తేదీ వరకు పొడిగించినందున, రైతులు వారు సాగుచేసిన కంది, వరి, సజ్జ,నువ్వులు,మినుము, ప్రత్తి, ఎండుమిరప పైరులకు ప్రీమియం చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో సాగుచేసిన పైర్లు అన్ని ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతులకు అవసరం అయిన యూరియా, డి.ఏ.పి, 20:20:0:13 ఎరువులు మార్కుఫెడ్ ద్వారా అందిస్తామని తెలిపారు. హార్టికల్చర్ అధికారి రమేష్ ఉద్యనశాఖలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు వివరించారు.కార్యక్రమంలో జే వి ఓ రమేష్ , ఏఈఓ దేవేంద్ర గౌడ్, వి ఏ ఏమల్లికార్జున, రైతులు పాల్గొన్నారు.


