జనం న్యూస్.ఆగస్టు26. సంగారెడ్డి జిల్లా.హత్నూర.
వినాయక మండపాల వద్ద విద్యుత్ సరఫరాలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని హత్నూర తహసిల్దార్ ఫర్హీన్ షేక్ అన్నారు.మంగళవారం మండల కేంద్రమైన హత్నూర రైతు వేదికలో వినాయక ఉత్సవాల నేపథ్యంలో గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఐకెపి సిబ్బంది కీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద నిర్వాహకులు విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ తీగలతో తదితర జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వినాయక నిమజ్జనంచేసే సమయంలో చెరువుల వద్ద లైటింగ్ వెలుగు ఎక్కువగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు, గ్రామపంచాయతీ కార్యదర్శిలు.ఐకెపి సిబ్బంది ప్రతిరోజు వినాయక మండపాల వద్దకు వెళ్లి పర్యవేక్షణ చేయాలని అన్నారు..ఈ సమావేశంలో , హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఎపిఎం రాజశేఖర్.ఎంపిడిఓ శంకర్. ఎంపిఓ యూసుఫ్ తో పాటు పలువురు ఉన్నారు.