
బిచ్కుంద. ఆగస్టు 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని దత్త నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంగీత పదోన్నతి పై మెనూర్ పాఠశాలకు బదిలీ కావడంతో సహచర ఉపాధ్యాయులు ఆమెను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయుడు కథలయ్య మాట్లాడుతూ పదోన్నతి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు ఎంతో నిబద్ధతతో అంకితభావంతో పనిచేసి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని వారి సేవలను ఘనంగా కొని ఆడారు. పి ఎస్ దత్త నగర్ పాఠశాలలో సుదీర్ఘకాలం పని చేసిన సంగీత టీచర్ బదిలీ అవుతున్నారని విద్యార్థులు తెలుసుకున్న సందర్భంలో విద్యార్థులు ఉద్వేగాన్ని ఆపుకోలేక వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతరమయ్యారు. అని ఇంతటి గొప్ప అనుభూతి కేవలం ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే సాధ్యమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎడ్ల గంగాధర్, మారుతి, హనుమంత్ రావు, జ్ఞానేశ్వర్, పంచాయతీ సెక్రెటరీ నందు రాములు తదితరులు పాల్గొన్నారు.