
మద్నూర్ ఆగస్టు 28 జనం న్యూస్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామాన్ని అతలాకుతలం చేశాయి..
వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు తమ ఆస్థిపాస్తులను, జీవనాధారాలను కోల్పోయి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు..ఈ అత్యవసర సమయంలో అది కూడా అర్థరాత్రి 12:30 గంటలకు ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు స్పందించారు.. డోంగ్లీ ప్రభుత్వ పాఠశాల మరియు మిర్జాపూర్ హనుమాన్ ఆలయంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శించారు..బాధితులతో మాట్లాడి వారి క్షేమ సమాచారాలు మరియు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.."ఈ బాధ మీది మాత్రమే కాదని తనది కూడా అని, ఈ కష్టకాలం తాత్కాలికం మాత్రమే, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, నేను మీకు అండగా ఉంటానని హామీ ఇస్తూ, ఎమ్మెల్యే గారు బాధితులకు భరోసా ఇచ్చారు ఇంకా అక్కడ ఉన్న చిన్నారుల పట్ల తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ, ఎమ్మెల్యే గారు వారికి బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చిగురించేలా చేశారు.. ఆ చిన్న సంతోషం ఆ పాఠశాల గదుల్లో వెలుగు నింపినట్లైంది.. ఆయన సానుభూతి, సహానుభూతితో స్పందించిన తీరు ప్రజల మనసును తాకింది,వారిలో భద్రతాభావం కలిగింది. ఒక నాయకుడిగా ఆయన చూపిన అపూర్వ నిబద్ధత, సామాజిక బాధ్యతకు ప్రతిరూపంగా నిలిచింది.. ఈ రాత్రి ఎమ్మెల్యే గారి సందర్శన సామాన్యంగా ఒక పరామర్శ కాదు,అది ప్రజలకు భరోసా, ఓదార్పు, జీవితంలో తిరిగి నిలబడే నమ్మకాన్ని కలిగించేందుకు చేసిన ఒక ఆత్మీయ ప్రదర్శన..

