జనం న్యూస్. జనవరి 27. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
గత నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు వివాహేతర సంబంధంతో ప్రియుడు మరో ముగ్గురితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో చోటుచేసుకుంది . కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మాల నారాయణ (45) భార్యలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి రెడ్డి ఖానాపూర్ గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు మృతుని భార్య లక్ష్మీ కి మల్లుపల్లి గ్రామానికి చెందిన కడారి రాకేష్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత నాలుగు రోజుల క్రితం రాకేష్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి మృతుడు నారాయణను దారుణంగా హత్య చేసి పల్పనూరు గ్రామ శివారులో నిర్మానుష ప్రాంతంలో గోన సంచిలో కట్టేసి మృతదేహాన్నిపడేశారు. తనకేమీ తెలియనట్లు మృతుని భార్య లక్ష్మి తన భర్త కనిపించడం లేదంటూ బంధువులతో కలిసి ఈ నెల 25న హత్నూర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్యలక్ష్మి తో సహా అనుమానితులుగా ఉన్న నలుగురిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు మృతుడు మాలే నారాయణ బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు