జనం న్యూస్ ఆగస్టు 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన, దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలే శ్వరం పుణ్యక్షేత్రంలో స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏ హరి హరినాథ్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు,ముందుగా కుండలేశ్వరం పుష్కర ఘాట్ వద్ద మమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహంతుల్లా స్వాగతంపలకగా, కుటుంబ సమేతంగా జల్లు స్థానం వద్ద కాళ్లు శుభ్రపరచుకొని ఆలయానికి వెళ్ళారు, పార్వతి కుండలేశ్వరం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయం దగ్గర దేవస్థానం కమిటీ సమక్షంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు, దర్శనం అనంతరం మండపం వద్ద ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ వారి ఆధ్వర్యంలో
వేదాశీర్వచనం అందించగా ఈఓ దుర్గా తీర్థ ప్రసాదాలను అందించారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి వి వి సుబ్బలక్ష్మిసత్యనారాయణ, సొసైటీ చైర్ పర్సన్ గంగుమళ్ళ రవి కుమార్, కోనసీమ వినియోగదాల సంఘం అధ్యక్షులు అరిగిన వెంకట రామారావు ముమ్మడివరం సీఐ మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్ఐ అవి నాష్, తహసిల్దార్ సుబ్బలక్ష్మి. ఆర విశ్వ నాథం,గ్రామ కార్యదర్శి ఆర్ దుర్గమ్మ, గ్రామ రెవెన్యూ అధికారి రామకృష్ణ,పలు శాఖల అధికారులు సిబ్బంది,గ్రామస్తులున్నారు.