జనం న్యూస్, ఆగస్ట్ 29, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పాతకాల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందించి 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ..పాతకాాల శ్రీనివాస్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అన్నారు. చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం సంతోషంగా ఉందని,వార్డు ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని రాబోయే రోజుల్లో వార్డు ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలపై స్పందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాతకాల సతీష్, మైస రమేష్,పాతకాల అనిల్,బాణాల సుధాకర్,కిషన్, అంజి, కమలాకర్, రఘు తదితరులు పాల్గొన్నారు.