గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం గుడిపల్లి మండలకేంద్రంలో వినాయకుడి వద్ద మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా’ అంటూ శుభం కలుగాలని ఏకదంతున్ని భక్తులు ఆరాధిస్తారని తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తి- శ్రద్ధలతో పాల్గొంటు ప్రజలంతా ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రులను జరుపుకోవాలని ఆయన సూచించారు. గణనాథుడి ఆశీస్సులతో విఘ్నాలను అధిగమించాలని ఆకాంక్షించారు. లంబోధరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని విఘ్నేశ్వరుని ప్రార్థించనున్నట్టు ఆయన తెలిపారు. పల్లె నుండి పట్టణం దాకా ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నదని అన్నారు. వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభం అయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టితత్వం మరింతగా బలపడాలని కే ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లి విరిసేలా దీవించాలని గణనాథుని ఆయన ప్రార్థించారు.