ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్
భూక్యా, రాజ్ కుమార్ నాయక్
(జనం న్యూస్ ఆగస్టు 29 ప్రతినిధి కాసిపేట రవి )
త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ లిస్ట్ ప్రక్రియ గ్రామాలలో మొదలుపెట్టారు, చెన్నూరు నియోజకవర్గం బి, ఆర్,ఎస్,పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ భీమారం మండలం బూరుగుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించారు. కానీ ఈ ఓటర్ల జాబిత, చనిపోయిన వారి పేర్లు మరియు రెండు ఒకరికి ఓటర్ కార్డులు ఇలా చాలా అభ్యంతరాలు ఉన్నాయని ఇలాగే పలు గ్రామపంచాయతీలలో ఇదే దుస్థితి కనబడుతుంది, ఇది ఇలాగే కొనసాగితే బి ఆర్ ఎస్, పార్టీకి అన్యాయం జరిగే ధోరణి అవలంబిస్తుందని ఈ ప్రక్రియ ఇలా కొనసాగితే పార్టీ శ్రేణులు ఎవరు సహించరని అన్నారు, అనంతరం బూరుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి కట్ట ఉమారాణికి వినతి పత్రం అందజేశారు,