ఆందోళన చెందవద్దంటున్న అధికారులు..
జనం న్యూస్, ఆగస్టు 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
జగదేవపూర్ యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. మండలంలోని HACA సర్వీసింగ్ సెంటర్ ,( శివాలయం రోడ్డు పిండి గిర్ని ఎదురుగా ) వద్ద రైతులు పెద్ద ఎత్తున చేరుకొని క్యూలో పట్టా పాస్ పుస్తకాలు పెట్టి పడి కాపులు కాస్తున్నారు.శుక్రవారం తెల్లవారుజామున నుండి సుమారు 200 మందికి పైగా రైతులు కేంద్రానికి చేరుకొని బారులు తీరారు.అన్నదాతల అవసరాలకు సరిపడా యురియా సరఫరా చేయాలని మండల రైతులు కోరుతున్నారు.