పునరావాస కేంద్రాల్లోని బాధితులకు తాసిల్దార్ వేణుగోపాల్ భరోసా
బిచ్కుంద. ఆగస్టు 29 జనం న్యూస్
మండలంలో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడద్దని వారికి అండగా ఉంటామని బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తాసిల్దార్ సెట్లూర్ గ్రామంలో పునరావాస కేంద్రాలలో ఉన్న మెక్క గ్రామ బాధిత ప్రజలతో మాట్లాడి, వారికి భరోసా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆపదలో ఉన్నవారు వెంటనే డయల్ 100కి కానీ, స్థానిక పోలీసులకు కానీ సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షం కారణంగా మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఉన్నందున మంజీరా పరివాహక గ్రామాలైన హస్గుల్, షెట్లూర్, ఖత్గావ్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగు వద్దకు సందర్శించడానికి ప్రజలు రావద్దని తాసిల్దార్ వేణుగోపాల్ కోరారు.