జనం న్యూస్ ; 29 ఆగస్టు శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
న్వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా, గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా శుక్రవారం సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాల వేసి వారు మాట్లాడుతూ గిడుగు రామమూర్తి చేసిన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారని, తెలుగు భాష కోసం వారు చేసిన సేవలను కొనియాడారు.