మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రం లోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ కేంద్రానికి శుక్రవారం నాడు సబ్ కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా బాధితుల యోగక్షేమాలు తెలుసుకుని వారికి వరదలు తగ్గే వరకు వారికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ వరద బాధితులకు స్వయంగా భోజనము వడ్డించారు . ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు తాసిల్దార్ ఎండి ముజీబ్ ఎస్సై విజయ్ కొండ సీఐ రవికుమార్ మరియు అధికారులు కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు.