నడుం క్రింది భాగం నుంచి స్పర్శ కోల్పోయిన హరీష్
జనం న్యూస్, ఆగష్టు 29, జగిత్యాల జిల్లా : మెట్ పల్లి
పట్టణంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో నివాసముంటున్న హరీది అసలే దీనస్థితి నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.ఏదో చాలీచాలని వేతనము కోసం తనకు కరెంటు పని నేర్చుకొని తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగులను గత నాలుగు సంవత్సరాలు క్రితం తీసుకోగా అందులో తాత్కాలిక ఉద్యోగిగా హరీష్ నియమితులయ్యారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన సాంబరి చంద్రశేఖర్ - భులక్షి దంపతులు రోజువారి కూలీలు కాగ వారి కుమారుడు సాంబరి హరిష్ తాత్కాలిక ఉద్యోగిగా పనులు చేస్తు జీవిస్తున్నారు. హరీష్ (31) కు కరెంట్ షాక్ తగలడంతో కుటుంబం రోడ్డున పడ్డదని,విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మెట్ పల్లి పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో విధ్యుత్ సబ్ స్టేషన్ పరిదిలో మెట్ పల్లి పటణనికీ చెందిన హరీష్ విధ్యుత్ సహయక తాత్కాలిక ఉద్యోగి(అన్మాన్ గా) ఐదు సంవత్సరాలుగా విదులు నిర్వహిస్తూ జూన్ 12 న బర్దిపుర్ గ్రామంలో విధ్యుత్ అంతరాయం పనులు చేస్తూండగా కరెంట్ షాక్ తగిలి కరెంటు పోల్ పై నుండీ పడి గాయలవ్వడంతో గ్రామస్థులు క్షతగాత్రుని మెట్ పల్లి పటణంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ రేణ అసుపత్రికి తరలించారని అన్నారు.రెండు నెలలు వైద్యం తీసుకున్నాక రెండు కాళ్లు ఆ చేతనంగా మారి మంచానికే పరిమితం అయ్యాడని అన్నారు. విద్యుత్ అధికారులు నామమాత్రంగా సందర్శించి చేతులు దులుపుకున్నారని అన్నారు.డ్యూటీ టైం అయిపోయిన తర్వాత లైన్మెన్ ప్రాంక్లిన్ విధులకు తీసుకువెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు.విధులు నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి కింద పడిన నన్ను లైన్మెన్ ప్రాంక్లిన్ పట్టించుకోలేదని హరీష్ అన్నారు. ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్న ఏ ఒక్క అధికారి తనని పరామర్శించలేదని అన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి దయనీయంగా ఉందని, తనకు భార్య,17 నెలల కూతురు కలదని తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నానని హరీష్ వేడుకుంటున్నాడు, కుటుంబంలో పనిచేసేవాడు మంచాన పడడం వల్ల ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని దయచేసి సంబంధిత అధికారులు స్పందించి అతని కుటుంబానికి న్యాయం చేయాలని కాలనీవాసులు అంటున్నారు.