జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున (జనవరి 27-2023)న నాటి అవినీతి, అరాచక, దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తూ టీడీపీ యువనేత నారాలోకేశ్ తొలి అడుగు వేశారని, ఆనాడు ఆయన వేసిన ఆ ఒక్క అడుగు లక్షల అడుగులకు ప్రేరణగా నిలిచి, కోట్ల గొంతుకలకు జీవం పోసిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువగళం పాదయాత్ర ప్రారంభమై రెండేళ్లు పూర్తైన సందర్భంగా టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ కు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదేరోజు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర, అహంకారంతో, అధికారమదంతో విర్రవీగుతున్న నాటి వైసీపీ ప్రభుత్వ పునాదులు బీటలు వారేలా చేసింది. ఆనాడు పడిన లోకేశ్ తొలి అడుగు లక్షల అడుగులకు ప్రేరణగా నిలిచి, కోట్ల గొంతుకలకు కొత్త ఊపిరి పోసింది. 2023 జనవరి 27న కుప్పం వరదరాజస్వామి పాదాల సాక్షిగా మొదలైన ప్రభంజనం 2023 సెప్టెంబర్ వరకు 226 రోజులు, 3,132 కిలోమీటర్లు సాగింది. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక, అరాచక విధానాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సహా. నాటి వైసీపీప్రజాప్రతినిధుల దుర్మార్గాలను నిగ్గదీసి ప్రశ్నించింది అని తెలిపారు. పాదయాత్ర ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి నాటి రాక్షస ప్రభుత్వం విఫలయత్నాలు చేసింది. నాటి పాలకుల విధ్వంస చర్యలు, విష రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచిన లోకేశ్, ప్రజలే అండగా, వారిచ్చిన మనోధైర్యంతో లక్ష్యాన్ని సాధించారు. ఆనాడు ఆయన వేసిన ఆ ఒక్క అడుగే 2024 మేలో జరిగిన ఎన్నికల్లో కూటమిపార్టీలకు కనీవినీ ఎరుగని విజయం కట్టబెట్టింది అని మాజీమంత్రి పుల్లారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.