జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము
గత ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతంలో నుండి పెద్దవాగూలో ప్రవహించిన వరద నీటి తాకిడికి పెద్దవాగు గోదావరి శివారులోని తోర్తి,బట్టాపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాల్లో రైతులకు చెందిన 660 ఎకరాల్లో సోయభిన్, వరి, పసుపు, మొక్కజొన్న పంటలు నష్టం జరిగినట్లు ప్రథమ అంచనా వేసినట్లు మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ తెలిపారు.అయన వెంట ఏ ఈ వో సాయి సచిన్, రైతులు, తదితరులు, ఉన్నారు.