జనం న్యూస్ 30 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జనసేనాని పుట్టినరోజు వారోత్సవాల్లో మూడోరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి
తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే సంఘ సేవకులకు సన్మానం
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవాన్ని శుక్రవారం ఉదయం, అక్షరాల దేవాలయం, మహాకవి గురజాడ గృహంలో ఘనంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత, జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు.
కార్యక్రమంలో ముందుగా తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి, మహాకవి గురజాడ విగ్రహానికి వచ్చిన పెద్దలంతా పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం తెలుగు భాష కోసం నిత్యం పాటుపడే తెలుగుభాషోధ్యమ కారులు, ప్రముఖ రచయితలు చివుకుల శ్రీలక్ష్మి,గురజాడ ప్రసాద్,ఇందిర దంపతులకు, సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ కుమార్,తెలుగు భాషా సేవాసంఘం అధ్యక్షులు, కళాకారులు ఆర్.బి. రామానాయుడు, ప్రముఖ సంఘసేవకులు, నడకసంఘం ఉద్యమకారులు డాక్టర్ ఎ. ఎస్. ప్రశకాశరావు మాస్టారు,ముళ్లపూడి శుభద్రాదేవి, సంఘసేవకులు మొయిద నారాయణ రావు మాష్టారు కు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 ఎలక్ట్ గవర్నర్ ఆరికతోట తిరుపతి రావు చేతులు మీదుగా సత్కరించారు.ఈసందర్భంగా ఆరికతోట తిరుపతి రావు మాట్లాడుతూ దేశభాషలందు తెలుగులెస్స అని, అమ్మలాంటి ఖమ్మనైన తెలుగును ప్రతీ తెలుగువాడు కాపాడాలని, అమ్మకే అమ్మ భాష నేర్పిన నిఖార్సు తెలుగువాడు, వ్యవహారిక భాషోధ్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకను తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని, ఇటువంటి గొప్పదినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను పురస్కరించుకొని చేయటం గొప్ప పరిణామమని జనసేన సేవాదళ్, జిల్లా చిరంజీవి యువత సేవలను కొనియాడారు.అనంతరం సన్మాన గ్రహీతులు చివుకుల శ్రీ లక్ష్మి,ఎలిశెట్టి సురేష్ కుమార్,డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాష్టారు, ఆర్. బి.రామానాయుడు మాస్టారు మాట్లాడుతూ అపజయం నుండి విజయాలు సాధించిన పవన్ కళ్యాణ్ దేశం మొత్తం తనవైపు చూసేలా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా పరిపాలన సాగిస్తున్నారని, పవన్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అభిమానులుగా మీరంతా కృషిచేస్తున్నారని అంటూ జనసైనికుల సేవలను కొనియాడారు.కార్యక్రమంలో చిరంజీవి యువత,జనసేన సేవాదళ్ సభ్యులు గాజులరేగ వాసు,కుందేటి రామకృష్ణ, వారాహి శ్రీనివాస్ పాల్గొన్నారు.