జనంన్యూస్. 30.సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల పరిధిలోని కొండూరు గ్రామంలో గత రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి. వరదలకు. ఒక్కసారిగా నీళ్లు ఇండ్లలోకి చొచ్చుకు రావడంతో ఏమి చేయలేని అన్నదాత ఒక్కసారి పరిస్థితి ఏమి చేయలేని దినస్థితి ఏర్పడింది. మండలంలోని కొందరి హృదయాలు చలించి స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు రావుట్ల గ్రామం నుండి నవ యువత కు సంబంధించిన యువకులు 10 క్వింటాళ్ల బియ్యం కొండూరు వరద బాధితులకు పంపిణీ చేశారు.