భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 30: జనం న్యూస్
సిపిఐ కొత్తగూడెం టౌన్ కార్యవర్గ సభ్యులు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణీ సురేష్ గారి బావ కామ్రేడ్ దాసరి దుర్గాప్రసాద్ దశదినకర్మలు శనివారం కొత్తగూడెం గాజులరాజం బస్తీలోని హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఐ కొత్తగూడెం టౌన్ కార్యదర్శి కామ్రేడ్ కంచర్ల జమలయ్య, సిపిఐ 3 టౌన్ ఏరియా కార్యదర్శి మొహమ్మద్ యూసుఫ్, కామ్రేడ్ కొత్తూరు రవి, కామ్రేడ్ కె. సోమయ్యలు దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దుర్గాప్రసాద్ సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండేవారని, ఆయన త్యాగాలను సిపిఐ పార్టీ ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు