జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో ఈ రోజు (30/8/25) గుంటూరు జిల్లా వట్టి చేరుకూరు మండలం పుల్లడిగుంట మలినేని లక్షమయ్య ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నందు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజక్ట్ ఇంటెన్సీఫైడ్ ఐ ఈ సి క్యాంపెయిన్ 2025 ద్వార విద్యార్దులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో డి ఆర్ పి యమ్ వాసుదేవరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల యువకులు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి ఎన్ని విధాలుగా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కలిగించారు అదే విధంగా యువకులు చెడు అలవాట్లు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి భావిజీవితాలను పాడు చేసుకోవద్దు అని చూసించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పారావు యన్ ఎస్ ఎస్ యూనిట్ పి ఓ డాక్టర్ సుబ్బారావు కలశాల సిబ్బంది మరియ జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వర రావు లింక్ వర్కర్ కె రాణి పాల్గొని నిర్వహించారు