జనం న్యూస్ ఆగస్టు 30 ముమ్మిడివరం ప్రతినిధి
ఘనంగా సన్మానించిన నాగార్జున స్ట్రీట్ బాలగణపతి సంఘ సభ్యులు
రాజోలు నాగార్జున స్ట్రీట్ లో ఉన్న బాలగణపతి సంఘం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజోలు తాలూకా గణేష్ నిమజ్జన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన కాసు శ్రీనివాస్ గారికి సంఘం సభ్యులు అలాగే గరుడ యూత్ సభ్యులు కలిసి ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చెల్లుబోయిన రాంబాబు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారని.. ఏ ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని.. ఈ సంవత్సరం రాజోలు ప్రముఖులు కాసు శ్రీనివాస్ గారి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎన్నాళ్లయినా చాలా శుభపరిణామం అని.. ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనంగా గణేష్ నిమజ్జనం చేయడం మా వంతు కృషి చేయడం రాంబాబు అన్నారు.. ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీను,ఉత్సవకమిటీ సభ్యులు దార్లబాబు,కాట్నరాజు,సుబుద్ధి,మావూరినాగబాబు,యేడిదనానాజీ,అప్పారిగుణ,తదితరులు వరకు..