జనం న్యూస్ ఆగస్టు 30 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన
కాట్రేనికోన మండల వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కాశి భరత్ పితృవియోగానికి గురయ్యారు.ఆయన తండ్రి సూర్యనారాయణ గురువారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.సూర్యనారాయణ అకాల మరణానికి చింతిస్తు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు,జిల్లా వైయస్ఆర్ సీనియర్ నాయకురాలు శ్రీమతి కాశి బాల ముని కుమారి,కాట్రేనికోన జెడ్పిటిసి నేల కిషోర్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహ మూర్తి,కందికుప్ప సర్పంచ్ చల్లగల వెంకటలక్ష్మి అప్పారావు,సొసైటీ మాజీ అధ్యక్షులు జగడం బాలయోగి, నాయకులు వజ్రపు శరత్,బూల పృథ్వి,వరసాల చిన్నరావు, జనిపల్లి రెడ్డి,దాసరి ధన రామ్ ప్రసాద్,ముడిదుడ్డి వెంకట రమణ,సాపే సూర్యప్రకాశ రావు,జి బ్రహ్మాజీ,సత్యవాడ మణికంఠ,మేకల బ్రహ్మానందం వివిధ గ్రామాల నాయకులు,కార్యకర్తలు అబిమానులు పరామర్శించారు..