జనం న్యూస్ ఆగస్టు 30:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలోశనివారం రోజునా స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠాపన భూమి పూజనుప్రధానోపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల అధ్యక్షులు నిర్వహించారు. స్వామి వివేకానంద గారి స్పృతి, ఆలోచన, ఆశయాలు తెలుసుకుని ఆచారించాలని ఈయన చరిత్రను, గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని భారత దేశాన్ని ప్రేమించి భారత దేశము మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించినవారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. ప్రాశ్చత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. హిందుత్వా బోధనలు ప్రజలకు చేశారు. భారత యువతకు దిశానిర్దేశం చేశాడు. ముపై తొమ్మిది వయసులోనే మరణించాడు. 1984 సంవత్సరములో భారత ప్రభుత్వం ఆయన జనవరి 12 వ తేదీన జన్మదినం రోజుననే జాతీయ యువజన దినోత్సవం ప్రకటించింది. ఇట్టి కార్యక్రమములో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు, క్యాషియర్, కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ యూత్ సంఘాలు రాయల్ గాయ్స్ యూత్,నవ చైతన్య యూత్, యువసేన యూత్ ,ఆదర్శ యూత్, సహృదయ యూత్, హిందూ పరివార్ యూత్,క్రేజీ బాయ్స్ యూత్, యంగ్ ఫైర్స్ యూత్,సూపర్ గయ్స్ యూత్, ముదిరాజ్ యూత్ , రెడ్ బుల్స్ యూత్,శివాజీ గయ్స్ యూత్, వి కింగ్స్ యూత్, రాయల్ ఫ్రెండ్స్ యూత్,గంగపుత్ర యూత్, రుద్రసేన యూత్,రాయల్ టైగర్స్ యూత్,కింగ్స్ యూత్ మరియు యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు .