జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రామ దేవాలయంలో లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు. ఈ సందర్భంలో గ్రామానికి చెందిన సంపతి గిరిబాబు భక్తి శ్రద్ధలతో లడ్డూను 70,500 రూపాయలుకు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు గిరిబాబు సేవాభావాన్నిఅభినందించారువేలం ద్వారా వచ్చిన మొత్తం దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించ నున్నారు.