జనం న్యూస్ సెప్టెంబర్ 01(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని మహిళ గ్రామ శివారులో రోడ్డు ప్రక్కన వదిలేసి వెళ్ళింది.శిశువు ఏడుపులు విన్న స్థానికులు బిడ్డను చేరదీశారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.