(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
మంచిర్యాలలో జిల్లాలో ఆదివారం రోజున డీజేఎఫ్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో డి జి ఎఫ్ జాతీయ వ్యవస్థాపకులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు తంగళ్ళపల్లి అరుణ్ కుమార్, అధ్యక్షతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా జిల్లాల్లో ఎన్నికలు లేదా ఏకగ్రీవ పద్దతిలో, సంఘాన్ని బలోపేతం క్రమంలో డీజేఎఫ్ జిల్లా కమిటీల్లో బలమైన అభ్యర్థులను జిల్లాల్లో చేర్చి మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా నూతన కమిటీ ఏర్పాటు చేశారు నూతన డిజిఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిని శ్రీకాంత్ జిల్లా,కోశాధికారి, కాసిపేట, రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండ్ల తిరుపతి , ఎన్నికయ్యారు, అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్యం కోసం పిల్లల చదువులకు సంబంధించి కృషి చేస్తామని,,100 మంది జర్నలిస్టులకు 10 లక్షల కవరేజ్ గల బీమా పాలసీ పది రోజుల్లో అందజేస్తామని పేర్కొన్నారు, డీజీఎఫ్ సంస్థను గౌరవిస్తూ సీనియర్లైన జర్నలిస్టుల మన్నన పొందుతూ డిజిఎఫ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లి దిశగా ముందుంటామని పదవుల ఆకాంక్ష కంటే పాత్రికేయుల బాగోగులే ముఖ్యమని అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పలు మండలాల పాత్రికేయులు పాల్గొని సభను విజయవంతం చేశారు