జనంన్యూస్. 01 సిరికొండ.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లోని ముషీర్ నగర్ గ్రామం లో నిన్న కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఉపారం మల్లయ్య కు సంబందించిన పెంకుటిల్లుకు ప్రమాదవశాత్తు నిప్పు చలారేగడంతో ఈ ప్రమాదంలో వారు కట్టుకున్న బట్టలు తప్ప ఇంట్లోని పూర్తి సామాను దగ్ధమైపోయాయి వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి. వారి కుటుంబం మొత్తం దిక్కుతోచని దీన పరిస్థితిలో ఉండడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్. ఆధ్వర్యంలో వారికి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు కొనిఇవ్వడం జరిగింది..ఇంటిలోని సామాను మొత్తం కాలిపోవడంతో మానవత్వంతో వస్తు, ఆర్థిక పరంగా ఆదుకునే దాతల కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తుంది.ఈ కార్యక్రమంలో ఫాండేషన్ సభ్యులు అయినాల శ్రీకాంత్, రాజేందర్, రవి, నవీన్, కోటేశ్వర్, బాలరాజ్, కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.