జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
భక్తులకు అన్నప్రసాదo పంపిణీ చేసిన సర్పంచ్
వినాయక చవితి వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచా యతీలోని నారాయణ రాజుపేట గ్రామంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సర్పంచ్ జంబు సూర్య నారాయణ తన మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివ నరసింహ తిరుపాల్ వెంకటసుబ్బయ్యల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శాలువాల తో ఘనంగా సత్కరించారు. దానాల్లో కల్లా అన్నదానం ఎంతో గొప్పదని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో పాలకవర్గ సభ్యులు నాగేంద్ర మాజీ సభ్యులు తిరుపాల్ ధనంజయ నాయుడు కానాకుర్తి వెంకటయ్య జయరాం రెడ్డి బలరాం.మట్టిబాబు.హనుమంతు పవనకుమార్ మెహర్ తుమ్మాది శివకుమార్ అక్కివెంకటరమణ శివ నరసింహులు.రాఘవులు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.