జనం న్యూస్ సెప్టెంబర్ 01: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలము: పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపుమేరకు సిపిఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూఏర్గట్ల మండలంలోని 35 మంది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హైదరాబాద్ ధర్నా ఇందిరా పార్క్ కు బయలుదేరారు..వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ , వర్షపు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆరోగ్యంసహకరించకపోయినా తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులు ఐక్యంగా ముందడుగు వేసి పి ఆర్ టి యు సంఘం చేపట్టిన ధర్నా కు హాజరవుతూ ఉపాధ్యాయుల భవిష్యత్తు భద్రత కోసం సిపిఎస్ రద్దు తప్పనిసరి అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ముందు కదిలారు.ఈ సందర్భంలో మండల అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ మాట్లడుతూ ఉపాధ్యాయుల త్యాగస్ఫూర్తిని ప్రశంసిస్తూ, సి పి ఎస్ ఉపాధ్యాయుల పోరాటానికి ఓ పి ఏస్ ఉపాధ్యాయులు సైతం ముందడుగు వేసి ధర్నాకు రావడం అన్ని విధాలుగా వారి మద్దతు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ మన హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిలబడితేనే విజయం సాధ్యం అని తెలియజేస్తూ చివరిగా ఏమ్ ఎల్ సి శ్రీపాల్ రెడ్డి చెప్పిన విధంగా సిపిఎస్ రద్దుకు ఇదే చివరి ధర్నా అని కచ్చితమైన ధీమాను వ్యక్తం చేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి సహకరించిన మండల ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.