జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
శివాజీ సేన జి.టి.పేట బాయ్స్ ఆధ్వర్యంలో జి.టి.పేట గ్రామం కొత్త వీధిలో శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి పండుగ సందర్భంగా ఆదివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు బారీ ఎత్తున వచ్చి సుమారు రెండు వేల మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.శివాజీ సేన సభ్యులు వినాయక చవితి సందర్భంగా ప్రజలకు భక్తి, భవనం నింపేలా పండుగ వేడుకలు నిర్వహించడంతో గ్రామమంతా ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామ యువకులు, పెద్దలు, భక్తులు అందరూ సహకరించారు.