(జనం న్యూస్ 01సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండల నర్సింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్డు రోడ్డాము ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి, ఊర చెరువు వరద నీరు రహదారిపై చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది వాహనదారులు, విద్యార్థులు, కార్మికులు ఈ మార్గాన్ని వినియోగించుకుంటుండగా, రహదారి పైకి చేరిన నీరు రవాణాకు ఆటంకంగా మారింది.స్థానికులు చెబుతున్న ప్రకారం, చెరువు ముందు భాగంలోని మతల నిర్మాణం జరగక వరద నీటి ప్రవాహం ప్రవహిస్తుందని , అంటున్నారు, ప్రజల ప్రాణ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“కాసులకు కక్కుర్తి పడి నిర్మాణాలను ఆపి , రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పరిష్కారం పకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం తప్పద” అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.