జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
గణేష్ సెంటర్లో వేంచేసి యున్న గణపతికి విద్యార్థినీ విద్యార్థులచే ప్రముఖ పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ (తంబి ) ఆధ్వర్యంలో విశేషమైన పూజలు నిర్వహించారు.. ముందుగా గ్రంధి నాగబాబు దంపతులచే స్వామివారికి అభిషేకాలు, గరిక పూజ జరిపి, అనంతరం సుమారుగా 100 మంది విద్యార్థిని,విద్యార్థులచే స్వామివారికి వివిధ రకాల పత్రులు, పుష్పములు, పెన్నులతో పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమానికి వ్యాపార ప్రముఖులు వివిధ రకాల ప్రసాదాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.. పూజా కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు దగ్గరుండి పిల్లలచే పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఆశపు బ్రదర్స్,గోకవరపు బ్రదర్స్, కంచు స్తంభం సోనీ, బషీర్, సుతాపల్లి నాగభూషణం, నాగబాబు తదితరులు పిల్లలకు ప్రసాదాలు పంపిణీ చేశారు.