జనం న్యూస్ సెప్టెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాల అయిన సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలను మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలియజేశారు. 1995 సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం ఆయన కర్తవ్యం గా భావించారని, ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు మరెన్నో సంచలనాలు సైబరాబాద్, హైటెక్ సిటీ నుండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర విజన్ 2047 వరకు, సంక్షోభాలు నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం నుండి పాతాళానికి పడిన ఆకాశమే హద్దుగా ఎదిగే తత్వం, విద్యార్థి దశ నుంచే రాటు దేలిన నాయకుడిగా, ఎక్కడ ఉన్న కింగ్ మేకర్ పాత్ర పోషించడం, టెక్నాలజీని అందిపుచ్చుకొని కొత్త పుంతలు తొక్కించిన ఘనత, ఫ్యూచర్ విజన్ తో ఎన్నెన్నో వినూత్న పథకాలు నాటి హైటెక్ సిటీ నుంచి అమరావతిలో నేటి క్వాంటం వ్యాలీ దాకా పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని నాగ జగదీష్ అన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టం కంటే జగన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఎక్కువ అని, ఏపీని గాడిని పెట్టేందుకు నిరంతరంగా కృషి చేస్తున్న కృషివలుడు చంద్రబాబు నని నాగ జగదీష్ అన్నారు. చంద్రబాబు పాలనలో పేదరికం లేని సమాజ స్థాపనకు విజన్ 2020 కి రూపకల్పన చేసి ప్రజల వద్దకు పాలన, జన్మభూమితో పల్లెల్లో వెలుగులు ప్రజా సంక్షేమం కోసం 2014-19 మధ్య 122 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని, చంద్రబాబు ఎక్కడున్నా కింగ్ మేకర్ అని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించి ప్రత్యేక క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారని, అదేవిధంగా జన్యు శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్, డి ఆర్ డి వో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి లాంటి వారిని సలహాదారులుగా నియమించుకోవడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునేలా ఏర్పాటు చేశారని, ప్రపంచ స్థాయి కార్పొరేటు స్థాయి దిగ్గజాలను మైక్రోసాఫ్ట్ అధినేత, అమెరికా అధ్యక్షుడు బిల్ కెంటన్ వంటి వారిని తీసుకువచ్చిన ఘనత కూడా చంద్రబాబు దూరదృష్టి ఆలోచించి నేటి యువతరానికి కావలసిన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకువచ్చి, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ప్రముఖ స్థానాల్లో ఉన్నారని నాగ జగదీష్ అన్నారు. అమరావతి రాజధాని, పోలవరం, విశాఖ ఐటీ హబ్ రాయలసీమ, కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర లో ఉన్న అన్ని జిల్లాలలో పరిశ్రమలు పెట్టడానికి తొమ్మిది లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాల లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నందుకు ప్రజలందరూ చంద్రబాబుని దీవించాలని రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలని నాగ జగదీష్ కోరారు.//