సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలి
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం
సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్
జనం న్యూస్.ఆగస్టు31. సంగారెడ్డి జిల్లా.హత్నూర.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ ప్రమోషన్లలో సంగారెడ్డి జిల్లాలో సుమారు190 మంది ఎస్ జిటి ఉపాధ్యాయులకు ఎస్ఏపిఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్స్ పొందడం జరిగిందని పాఠశాలల్లో190 ఎస్జిటిల ఖాళీలు ఏర్పడ్డాయని.వాటిని వెంటనే భర్తీ చేయాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ప్రభుత్వం ఇచ్చిన వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది కేవలం ఎస్జిటి లకు మాత్రమే వర్ధించడంతో గత నెలలో వర్క్ అడ్జస్ట్మెంట్ వల్ల మెజారిటీ ప్రాథమిక పాఠశాలల్లో50నుండి60 మంది విద్యార్థులు ఉన్న కేవలంఇద్దరు లేదా90లోపు ఉన్న ముగ్గురే ఉపాధ్యాయులు మిగిలిపోయారని తెలిపారు ఈ రేషనలైజేషన్ నామ్స్,వర్క్ అడ్జస్ట్మెంట్ జీవోలవల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులైన ఎస్జీటీలను వివిధ రకాల పాఠశాలలకు తిప్పుతూ వారికి ఎటువంటి స్థిరత్వం లేకుండా మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా దెబ్బతీయడానికి తీసుకోబడుతున్న నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేదా పిఎస్ హెచ్ఎం ప్రాథమిక పాఠశాలల్లో ఉండేలా ప్రభుత్వం చూడాలి పాఠశాలల మనుగడ కాపాడాలి కోరారు.అదేఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సంబంధం లేకుండా సబ్జెక్ట్ కి ఒక టీచర్ పిఈటి ఒక ప్రధానోపాధ్యాయుడు ఉంటారని
కాని ప్రాథమిక పాఠశాలలలో 40 నుండి 50 మంది విద్యార్థులు ఉన్నచోట కూడా ముగ్గురు ఉపాధ్యాయులు ఉండకూడదాఅని ప్రశ్నించారు.
50మందివిద్యార్థులు ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఫీఎస్ హెచ్ఎంను కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇచ్చిన సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకొని ప్రమోషన్ ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ ఎస్జిటి ఖాళీలను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలని తెలిపారు తాత్కాలికంగా విద్యావలంటీర్లను నియమించి ప్రభుత్వం ప్రాథమిక విద్యావ్యవస్థను కాపాడాలని కోరుతూ విద్యావాలంటరిలను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.