6వ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శమిస్తున్నా గణేష్ గడ్డ గణనాథుడు.
జనం న్యూస్ సెప్టెంబర్ 01 సంగారెడ్డి జిల్లా
పటాన్ చెరువు నియోజకవర్గం రుద్రారం గ్రామం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో ప్రతిరోజు గణనాధునికి అలంకరణ నిర్వహిస్తున్నారు. మొదటిరోజున హరిద్రవర్ణము, రెండవ రోజున కుంకుమ వర్ణంలో, మూడవ రోజున పితా వర్ణం, నాలుగో రోజున కృష్ణ వర్ణంలో, ఐదవ రోజు రుద్రాక్షేశ్వరుడిగా , ఆరవ రోజున అన్నపూర్ణేశ్వరునిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. సిద్ది గణపతి స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.భక్తుల కోరిన కోరికలను నిరంతరం నెరవేరుస్తూ కొంగుబంగారమై వెలిసిన గణనాథుడని, గణేష్ గడ్డ దేవాలయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక దేవాలయముగా గుర్తించబడినదనీ, ఇక్కడికి వచ్చిన భక్తులకు నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో లావణ్య అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు రుద్రారం గ్రామ పెద్దలు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను సమకూర్చారని అన్నారు.ఆరవ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రాచలం రామ మందిరం వ్యవస్థాపకులు రామభక్తుడు భక్త రామదాసు {కంచర్ల గోపన్న} వారసుడు (11వ తరం) కంచర్ల వెంకట రమణ గణేష్ గడ్డ సిద్ధి వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, ఆలయ కమిటీ తరఫున కంచర్ల వెంకటరమణ కు స్వాగతం పలుకుతూ శాలువాలతో సన్మానం చేసి స్వామివారిని ప్రత్యేక దర్శనం చేయించి తీర్థప్రసాదలను అందజేశారు.హైదరాబాద్ నివాసి సిద్ది గణపతి భక్తుడైన చంద్ర శేఖర్ కుటుంబ సభ్యులతో విచ్చేసి గణపతి నవరాత్రులలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా సొంత నిధులతో మొబైల్ టాయిలెట్ ని బహుమానంగా ఇవ్వడం జరిగిందనీ ఆలయ ఈవో లావణ్య అన్నారు. గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయ అభివృద్ధి కొరకు భక్తులు ధన రూపే వస్తు రూపేనా కానుకలను సమర్పించే వారు దేవాలయ ఈవో లావణ్య ను సంప్రదించగలరని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.