CPS రద్దు చేసి OPS (పాత పెన్షన్ విధానాన్ని ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ముందు ఉద్యోగులు ప్లా కార్డ్స్ తో నిరసన తెలిపారు.
మద్నూర్ సెప్టెంబర్ 1 :-( జనం న్యూస్)
ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం డి ముజీబ్ గారు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానంతో ఉద్యోగులకు భద్రత ఉండేది CPS వల్ల ఉద్యోగులకు వారి కుటుంబాలకు బరోసా లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
2004 తర్వాత చేరిన ఉద్యోగులు CPS కిందకి తీసుకువచ్చారని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగి మరణించినా 40% కూడా నగదును ప్రభుత్వాలు ఇవ్వలేక పోవడం అన్యాయం అన్నారు.ఉద్యోగి పెన్షన్ మొత్తం షేర్ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉండటం విచారకరమని అన్నారు.CPS వల్ల ఉద్యోగి పదవీ విరమణ తర్వాత DA లు వర్తించడం లేదన్నారు.OPS అమలు చేస్తున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు,ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్, జార్ఖండ్ లు అమలు చేస్తున్నాయి. త్వరలో పంజాబ్, కర్ణాటక ప్రభుత్వాలు పునరుద్ధరణపై ఆలోచన చేస్తున్నాయి అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో CPS రద్దు చేసి OPS అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు కావున వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో OPS రద్దు చేస్తూ తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎం.పి.వో వెంకట నర్సయ్య, గిర్దవార్ ఏం శంకర్, జూనియర్ అసిస్టెంట్ లు రవి కుమార్, బాలరాజు, కావేరి, దశరథ్, రికార్డు అసిస్టెంట్ లు హన్మండ్లు, రాజేశ్వర్, నర్సింలు, మరియు కార్యాలయ ఉద్యోగులు హన్మండ్లు, గంగారం, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.