స్థానిక సంస్థల 42 శాతం బీసీ రిజర్వేషన్లు లో వర్గీకరణ *చేయాలి .
కురిమెల్ల శంకర్ టీ జేఎంయూ జిల్లా అధ్యక్షులు
జనం న్యూస్ 01 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం )
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42శాతం బీసీ బిల్లు వర్గీకరణ ఊసే లేకుండా ఉండడం అన్యాయం.గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42 శాతంతో పాటు ఉప వర్గీకరణ చేపడతామని ప్రభుత్వ హామీ ఇచ్చింది కానీ. ఈరోజు ప్రవేశపెట్టిన బీసీ బిల్లు లో వర్గీకరణ(A,B,C,D) మాటే లేకపోవడం తీవ్రంగా నిరసిస్తున్నాము. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం వర్గీకరణ కూడా చేపడతామనేటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.కురిమెళ్ళ శంకర్
టీజేఎంయు జిల్లా అధ్యక్షులు 9908796369