జనంన్యూస్. 01. సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని పెద్ద వాల్గోట్ గ్రామంలో ఇటీవల కురసిన భారీ వర్షాల కారణంగా వాగు హనుమాన్ టెంపుల్ వరకు వరదలు పారి ఇండ్లలోకి నీరు చేరి ఎస్సీ కాలనీ మరియు మైనారిటీ కాలనీ అదేవిధంగా దాసరి వాడ మరియు గ్రామపంచాయతీ వెనకాల వారికి ఇంట్లోకి నీరు వెళ్లి నిత్యవసర వస్తువులు పాడైపోయినాయి. కాబట్టి వారందరికీ మా గ్రామంలోని వారు చుట్టుపక్కల గ్రామాల వారు తెలిసినవారు ఎవరికి తోచిన విధంగా వారు ధన రూపంలో వస్తు రూపంలో డబ్బులను ఫోన్ పే చేసి మాకు మ గ్రామానికి సహకరించి నిత్యవసర వస్తువులను. బియ్యము రెండు రకాల పప్పులు నూనె పసుపు కారము వంటి వస్తువులను 60 నుండి 70 కుటుంబాలకు అందజేయడం జరిగింది సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా గ్రామం నుండి మా ప్రజల నుండి మా నుండి పేరుపేరునా ఇందులో పాల్గొని డిస్ట్రిబ్యూషన్ సేవ చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాప్రత్యేక ధన్యవాదములు.