జనం న్యూస్- సెప్టెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ రెండవ వార్డులో చిన్నారులు ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహం ఆకర్షణగా నిలిచింది. వార్డులోని చిన్నారులు జి రామ్మోహన్ ఆదిత్య, జి రఘువీర్, జి రణధీర్, సత్యసాయి, గొట్టిముక్కల రోహిత్ లు తమ ఇంటి సమీపంలో పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. స్థానికులు తమ తల్లిదండ్రుల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు భక్తి భావంతో పాటు పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.