జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 2 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఎయిడ్స్ రోగులపై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తమను ఇష్టం సారంగా తిడుతున్నారని, ప్రజాసమస్యల పరిష్కార వేదికలో గత నెల 25వ తేదీన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబుకు మేలిమి వీరయ్య ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు సోమవారం ఆసుపత్రికి పల్నాడు జిల్లా టీబి, ఎయిడ్స్, లెప్రసీకి సంబంధించిన అధికారి డాక్టర్ మురళీకృష్ణ విచారణ చేపట్టారు. రోగులకు సంబంధించిన ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగులపట్ల డాక్టర్లు వ్యహరిస్తున్న తీరుపై రోగులను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ కు, డి ఎం హెచ్ ఓ కు నివేదిక అందజేస్తామన్నారు.తగు చర్యలు వారు తీసుకోవాల్సిన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు హరిప్రసాద్, జానీ భాష, తోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.