మద్నూర్ సెప్టెంబర్ 2 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం గోజెగావ్ సొనల గ్రామాలలో అధిక వర్షానికి లెండి వాగు అధిక ఉద్రిక్తి వలన మునిగి పోయిన సోయాబీన్ పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు మరియు మండల తహసీల్దార్ ఎండి ముజీబ్, ఎంపిడిఓ, సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కొండ ,మరియు గ్రామ రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది.నష్టపోయిన పంటలను గ్రామాల వారిగా ఏఈవో లు సర్వే చేస్తున్నారని పంట నష్టపోయిన ప్రతి రైతుల వివరాలను సేకరించి పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, హన్మండ్లు, రమేష్, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.