జనం న్యూస్ 02 సెప్టెంబర్ కొత్తగూడెం నియోజకవర్గం)
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ బహిరంగ సవాల్ విసిరింది.
జిల్లా అభివృద్ధి శూన్యం అని ఆరోపిస్తూ బీజేపీ పలు ప్రశ్నలు లేవనెత్తింది.
సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి అన్యాయం. కొత్తగూడెం–తల్లాడ నేషనల్ హైవే పనులు నిలిచిపోవడం.
పాల్వంచ విద్యుత్ ప్లాంటు అభివృద్ధి లేమి. భారీ పరిశ్రమలు లేకపోవడం వల్ల యువతకు అన్యాయం.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ప్రజాధన దుర్వినియోగం. బస్టాండ్, ప్రయాణికుల ప్రాంగణంలో దుర్వాసన.
ఆదివాసీలకు పౌడు భూమి పట్టాలు ఇవ్వకపోవడం. భద్రాచలం కరకట్ట వాగ్దానం నిలవకపోవడం.
గోదావరి నీళ్లు, ఇసుక అందకపోవడం. ఔటర్ రింగ్ రోడ్డు 400 కోట్లు నిలిచిపోవడం.సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం లేకపోవడం. షాడో ఎమ్మెల్యే ఆధిపత్యం.“జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు” అని బీజేపీ మండిపడింది.