జనం న్యూస్ సెప్టెంబర్ 2 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార స్వామి రీపోటర్ )
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఎల్కతుర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ (బాక్కి) ఆధ్వర్యం నిర్వహించగా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం హాజరై ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబాల శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన ప్రజానాయకుడని కొనియాడినారు తన పాలనలో సాధించిన పథకాలతో ప్రతి రైతు, ప్రతి పేద కుటుంబం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్, రైతు బీమా, 108, 104 అత్యవసర సేవలు, పావలా వడ్డీ రుణాలు, అరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ళు, జలయజ్ఞం వంటి పథకాలను గుర్తు చేశారు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమం వల్లే పేదలు, రైతులు, కార్మిక వర్గాలు నమ్మకంగా జీవించగలిగారని పేర్కొన్నారు.అలాగే డాక్టర్ వైయస్ కల నిజమైన కర్షకపాలన అని, తెలంగాణలోనూ ఆయన వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని తెలిపారు. యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన అడుగుజాడల్లో నడుస్తామని సంకల్పబద్ధత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సుగిన సంతాజి సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్, మాజీ సర్పంచ్ గోడిశాల యాదగిరి, గోడిశాల రాజయ్య, డాక్టర్ రమేష్ బాబు,పాక రమేష్,రంజిత్ రెడ్డి,బచ్చు బాబు రావు, మండ సుమన్, దాట్ల శ్రీకాంత్,వెంకట్, ప్రదీప్, నితిన్, బత్తిని శ్రీనివాస్, రవీందర్, సుధీర్,తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.