జనం న్యూస్ సెప్టెంబర్ 2
జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ముందస్తు అప్రమత్తత మరియు పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులను దూరం చేయొచ్చని తుంగూర్ గ్రామీణ వైద్య సిబ్బంది పేర్కొన్నారు.తుంగూర్ గ్రామంలో గ్రామీణ వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.వైద్య శిబిరంలో భాగంగా జ్వర సర్వే ,మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు.వాతావరణ మార్పులు అపరిశుభ్రతతో దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు,దోమ కాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు,ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతను విధిగా పాటించాలన్నారు,కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ హెచ్ పి సుష్మా, ఏఎన్ఎమ్ ఇందిరా,అరుణ మరియు ఆశలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.