జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నందలూరు మండల నాగిరెడ్డిపల్లి పంచాయతీ ఆఫీస్ సర్కిల్ ఆర్ & బీ బంగ్లా వద్ద జనసేన నాయకులు కేదార్నాథ్ బాబు ,ఉమ్మడి కడప జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు గురివిగారి వాసు మరియు నందలూరు మండల జనసైనికుల అధ్వర్యంలో అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలు.ముఖ్య అతిథిగా బడుగు బలహీన వర్గాల నాయకులు ఎవరికి ఏ జనసైనికుడికి కష్టం వచ్చినా ముందు ఉండే రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ చేతుల మీదగా భారీ కేక్ కటింగ్ మరియు మండల పారిశుధ్య మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది మరియు నందలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమములు మన కృష్ణ చేసారు.ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారికృష్ణ అలాగే ఈ కార్యక్రమానికి నందలూరు ముఖ్య నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ సాగర్,నాగిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ, నందలూరు సర్పంచ్ రాము జనసేన నాయకులు కేదారనాథ్ బాబు,ఉప్పుశెట్టి సుధీర్ ,టీడీపీ నాయకులు వెంకట సుబ్బయ్య బీజేపీ నాయకులు జయకుమార్ రెడ్డి, రాజబోయిన మహేష్, ఆవుల రమేష్,టీడీపీ నాయకులు గంగాధర్ , నీలిపల్లి రెడ్డయ్య మరియు జనసేన నాయకులు అరుణ్ పాండే, హోటల్ శివ, ప్రతాప్,దినేష్, మస్తాన్ రాయల్,నరహరి,ఈశ్వర్,నందు,శేఖర్,మనీష్, బన్నీ, చొట్టు, చిన్ను ఎన్డీయే కూటమి తరపున మండలంలోని నాయకులు పాలుగొన్నారు.