జనం న్యూస్ 03 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గ)
భద్రాద్రి కొత్తగూడెం లంబాడీలపై జరుగుతున్న కుట్రలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధ్యులని, ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్టేజీపైకి ఎక్కిస్తే లంబాడి సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమవుతుందని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు.మంగళవారం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం, పార్టీ నేత సోయం బాబురావు లంబాడీలపై విష ప్రచారం చేయడం తీవ్రంగా ఖండించారు. సోయం బాబురావును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.లంబాడీలపై కుట్రలు జరుగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు స్పష్టం చేశారు. రేపు చుండ్రుగొండలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనలో లంబాడి ప్రజలు ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు.“ఆదివాసులు – లంబాడీలు అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నా, కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సమాజాల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నారు. ఇకపై ఇలాంటి కుట్రలకు లంబాడీలు తలొగ్గబోరు” అని వారు స్పష్టం చేశారు.జిల్లాలో లంబాడి సంఘాల JAC ఏర్పాటు చేసి, భవిష్యత్తులో జరిగే ప్రతి దాడిని, ప్రతి కుట్రను ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ సమావేశంలో గుగులోతు రాజేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, లావుడియా ప్రసాద్ నాయక్, బానోత్ వీరు నాయక్, రాములు నాయక్, వెంకటేశ్వరరావు నాయక్, జానకిరామ్ నాయక్, బానోత్ శ్రీనివాస్ నాయక్, హతిరాం నాయక్, మోహన్ నాయక్, పూర్ణచంద్ర నాయక్, లావుడియా సత్యనారాయణ నాయక్, శంకర్ నాయక్, రవి రాథోడ్ నాయక్, దుర్గాప్రసాద్ నాయక్, బాబు నాయక్, హుస్సేన్ నాయక్, బాలు నాయక్, హరి నాయక్, భద్రంగి నాయక్, లాలు నాయక్, వెంకట్ నాయక్, పృధ్వి నాయక్, వీరు నాయక్, బానోతు రాందాస్, జాటోత్ భారత్ తదితరులు పాల్గొన్నారు