జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 3
ఘనంగా ఇమ్మడి కాశీనాధ్ జన్మదిన వేడుకలు
వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో మూడువేల మొక్కలు పంపిణీ చేసిన జనసైనికులు
ప్రకాశం జిల్లా తర్లుపాడుమండలం కేంద్రం అయిన తర్లుపాడు లో జనసేన పార్టీ నాయకులు వెలుగు కాశిరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు మార్కాపురం జనసేన పార్టీ ఇన్చార్జి ఇమిడి కాశీనాథ్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేకును ఏర్పాటు చేసి కూటమి నాయకులు కార్యకర్తలు సమక్షంలో విజయరావు నరసింహ, సొసైటీ చైర్మన్ వెలుగు క్రాంతి కుమార్,కాశీరామ్ సింగ్ కేక్ ను కట్ చేశారు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు,మూడువేల మొక్కలను ఉచితంగా వెలుగు కాశీరావు ఆధ్వర్యంలో పఠాన్ కరీముల్లా, షేక్ బాషా, గుంటు భాస్కర్,ఆరే అంజి గ్రామం లో వీధి వీధి తిరిగి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ
జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నమ్మిన అభిమానులకు, ఆదరించిన ప్రజలకు మేలు చేయాలన్న గొప్ప ఆలోచనతో పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారు అని,అది మొదలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో ఒడిదొడుకులు, అవాంతరాలను అధిగమించి, స్వశక్తి, సంకల్పంతో ఎదిగారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన, కూటమి నాయకులు ఈర్ల వెంకటయ్య, బెల్లంకొండ గోపి, సిరిగిరి శ్రీనివాసరావు, పిన్నిబోయిన శ్రీనివాసరావు, సి హెచ్ శ్రీనివాసులు,సురే సువర్ణ, కందుల కళావతి,సిద్ధం కృష్ణ వేణి,గోసు వెంకటేశ్వర్లు ,కొండెబోయిన సునీల్ కుమార్, గడ్డం బాలరాజు,గంజారపల్లి మహేష్, గుంటు మోషే, మువ్వా సురేష్,రోడ్డా శ్రీనివాస్,గుండెబోమ్మ శ్రీనివాస్,షేక్ ఖాసీం వలి, షేక్ అఫ్రోజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.