జనం న్యూస్ ఆగస్టు(3) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గంలో బుధవారం నాడు మహిళా రైతులు యూరియా కోసం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై కూర్చొని ధర్నా చేసినారు. వారం రోజులుగా ఉదయం 6 గంటల నుండి షాపుల వద్ద నిలబడి తిండి లేక పడి కాపులు కాసిన ఒక యూరియా బస్తా కూడా దొరకట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసినారు. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు వెంటనే చర్యలు తీసుకొని రైతులందరికీ యూరియా అందించాలని డిమాండ్ చేశారు.