జనం న్యూస్,సెప్టెంబర్03,
అచ్యుతాపురం: ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసులో ప్రతి బుధవారం
నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అర్జీలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపిస్తామని విజయ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పాఠశాల సముదాయం చాలకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి అదనపు గదులు నిర్మాణానికి స్థలం కేటాయించి, అవసరమైన నిధులు విడుదల చేయాలని జనసేన పట్టణ పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీను,ఎమ్మెల్యే అర్జీ అందజేశారు. దీనిపై రెవెన్యూ, విద్యాశాఖ వారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.అలాగే పూడిమడక గ్రామంలో విఏఓగా పనిచేస్తున్న కోదండమ్మ డ్వాక్రా మహిళలు నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తుందని తెలుపుతూ జనవాణి కార్యక్రమంలో పూడిమడక గ్రామస్తులు నూకమ్మ, శ్రీను ఎమ్మెల్యే కు అర్జీని అందించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.