జనం న్యూస్ సెప్టెంబర్ 03: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజునా నవ భారత సాక్షరతా కార్యక్రమం "ఉల్లాస్ "మండల స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఒక ఉపాధ్యాయుడు, వి ఓ లకు రిసోర్స్ పర్సన్ లుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరంతా గ్రామంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి, వారిచే గ్రామంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం కొనసాగుతుందని మండల విద్యాశాఖాధికారి బి.ఆనంద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుకొమగిరి కృష్ణాచారి , ఐ కె పి ఎ పి యమ్ గంగాధర్ పాల్గొన్నారు. డి ఆర్ పి లు విజయ్ కుమార్ , గంగాధర్ లు శిక్షణ ఇచ్చారు.